పుట్టింది పెరిగింది ఢిల్లీలో అయినా పదహారణాల తెలుగు ఆడపడుచులా తన అందం,నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది రకుల్. మిస్ ఇండియాగా ఎంపికైన రకుల్ మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజుల్లోనే అగ్రహీరోలతో సినిమా ఛాన్స్ కొట్టేసిన రకుల్ పుట్టినరోజు నేడు.
కెరటం సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ తర్వాత వెకంటాద్రి ఎక్స్ ప్రెస్‌తో వరుస సినిమా అవకాశాలను కొట్టేసింది. ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్ తో బ్రూస్ లీ, ధృవ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన రకుల్…..నాన్నకు ప్రేమతో సినిమాకు ఉత్తమనటి అవార్డును సొంతం చేసుకుంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తునే మరోవైపు బిజినెస్ రంగంలోనూ రాణిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలితో పాటు విశాఖపట్నంలో ‘ఎఫ్ 45’ పేరుతో అత్యాధునిక జిమ్‌ను నెలకొల్పి ఫిట్ నెస్ ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. హిట్ ,ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రకుల్ మరిన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాలని సొంతం చేసుకోవాలని కోరుకుంటూ గ్రేట్ తెలంగాణ.కామ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
Also Read:Bigg Boss 7 Telugu:ఆరో వారం మొదలైంది రచ్చ..