ఆరడుగుల హైట్, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్, అందరినీ ప్రేమగా డార్లింగ్ అని పిలుస్తూ, అందరికీ దగ్గరయ్యాడు టాలీవుడ్ హీరో, యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 సంవత్సరాలు.. చేసినవి 18 సినిమాలు. అందులో విజయాలు ఉన్నాయ్. అంతకు మించి అపజయాలు ఉన్నాయి.
హిట్టొస్తే కాలర్ ఎగురేయడు.. ప్లాప్ వచ్చింది కదా అని క్రుంగిపోడు. అతడి నైజం వైవిధ్యం.. అతడి మార్గం కమిట్‌మెంట్. ప్రభాస్.. ఆరడుగుల ఆజానుబాహుడు అనే మాటకు అసలు సిసలు కటౌట్. హీరో అంటే ఇలా ఉండాల్రా అనిపించే రూపం.
ఈ క్వాలిటీస్ చాలు అతడంటే ఆయన ఫ్యాన్స్‌కు ఎందుకు అంత ఇష్టమో చెప్పడానికి. అందుకే అతడు దర్శకులకు ఇష్టమైన ‘డార్లింగ్’,నిర్మాతలకు కాసుల ‘వర్షం’ కురిపించే ‘మిస్టర్ ఫర్‌ఫెక్ట్’.
అందుకే… అటు క్లాస్, ఇటు మాస్,మొత్తంగా ఫ్యామిలీ మొత్తం ప్రభాస్‌కి అభిమానులైపోయారు. ‘బాహుబలి’తో తెలుగు సినిమా కీర్తి పతాకను ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడించాడు. రూ.వంద కోట్ల అంకెని అందుకోవడం కలలా ఉన్న తెలుగు చిత్రసీమకు ఏకంగా రూ.17 వందల కోట్ల రుచి చూపించాడు. కరువు తీరా.. రికార్డులు సృష్టించాడు.
‘తెలుగు సినిమాకి ఇంత మార్కెట్ ఉందా?’ అంటూ బాలీవుడ్ సైతం కుళ్లుకునేంత గొప్ప విజయాన్ని అందించాడు. ప్రభాస్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల సొత్తు మాత్రమే కాదు… ఇండియన్ ‘బాహుబలి’ కూడా! ఆ బాహుబలి పుట్టిన రోజు..ఈరోజు. ఈ సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ కి www.greattelangana.com బర్త్‌డే విషెస్ చెప్తోంది.
Darling Prabhas Birthday celebration#HBDDarlingPrabhas pic.twitter.com/85b0V7PlDA
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 23, 2017