విలక్షణమైన పాత్రలు.. విభిన్న తరహా కథలు.. వాటికి తగ్గ మేకోవర్.. పాత్రలో పరకాయ ప్రవేశం.. పాత్రను ఓన్ చేసుకొనే తీరు .. ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి. నాలుగు పదుల సినీ కెరీర్ లో అన్ని రకాల పాత్రల్ని పోషించి మెప్పించారు ఆయన. పెక్యులర్ వాయిస్ .. వైవిధ్యమైన రీతిలో పలికే డైలాగ్స్ .. మలయాళీలను మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. ఆయనే మోహన్ లాల్.ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..
మోహన్ లాల్ అసలు పేరు.. మోహన్ లాల్ విశ్వనాధ్ నాయర్. 1960 మే 21 పట్టణమిట్ట గ్రామంలో పుట్టిన ఆయన ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ వయస్సులోనే 90 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
స్నేహితుల బలవంతం మీద సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1980లో సినీ రంగంలో ప్రవేశించిన మోహన్ లాల్ నాటి నుంచి నేటి వరకు విభిన్నపాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా మన్యం పులితో బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు రాబట్టారు. తర్వాత లూసిఫర్‌తో తిరుగులేని హిట్ కొట్టారు. కథలో విషయం ఉండాలి కానీ భాష ముఖ్యం కాదు అంటారు మోహన్ లాల్..అందుకే ఆయనను ఐదు జాతీయ అవార్డులు వరించాయి.
Also Read:అంతర్జాతీయ టీ దినోత్సవం..
తెలుగులో ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్.. మళయాళంలో కుర్ర హీరోలు పృథ్వి రాజ్ , ఆర్య, విశాల్ లాంటి హీరోలతో మల్టీస్టారర్ లు చేసి మెప్పించాడు. ఇక మోహన్ లాల్ 1988 లో సుచిత్ర ను వివాహమాడారు. వీరికి ప్రణవ్, విస్మయ ఇద్దరు పిల్లలు. ప్రణవ్ ఇటీవలే హృదయం మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. మోహన్ లాల్ ఇలాంటి విజయాలను మరెన్నో అందుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.
Also Read:Ram Charan: ది గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్..