పద్నాలుగేళ్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. ఈ సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో విస్మరించలేని పేరు హరీశ్‌రావు. ఉద్యమంలోనే కాదు.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ ఆయన కీలక మంత్రి. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్. కేసీఆర్ మేనల్లుడిగా తెరపైకి వచ్చినప్పటికీ ఆ తర్వాత తన సత్తా ఏమిటో నిరూపించుకున్న యువ నేత. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజా నేత. క్షేత్రస్థాయిలో యువత, శ్రేణులను సమీకరించి, ప్రత్యర్థులకు చెమటలు పట్టించగలిగే స్థాయి ఉన్న వ్యూహరచయిత. కేసీఆర్ తీసుకునే కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్రధారి. మామ అడుగుజాడల్లో నడిచే మహానేత. ట్రబుల్ షూటర్,డైనమిక్ లీడర్ హరీష్ రావు పుట్టినరోజు నేడు.
ఉద్యమం తొలినుంచి మేనమామ కెసిఆర్ వెంట అడుగువేస్తూ ప్రతిచోట తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్న హరీష్ రావు ఎక్కడ సమస్య ఎదురైనా పరిష్కరించడంలో ముందుంటారు. ప్రజాసేవలో ఎప్పుడు ప్రత్యేక వైఖరిని అవలంబిస్తూ ప్రజలకు మరింత చేరువవుతారు. కేవలం రాజకీయ విమర్శలను తీవ్రస్థాయిలో గుప్పించడంలో మాత్రమే కాదు. తన సొంత నియోజకవర్గ ప్రజల సంక్షేమం విషయంలో కూడా ఆయన ఇతరులకంటె చాలా యాక్టివ్ అని పలువురు అంటుంటారు.
సంకల్పం ఉంటే ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి నేతలకు ఉంటే అద్భుతాలు జరుగుతాయనడానికి ప్రస్తుతం సిద్ధిపేట యావద్దేశానికే ఉదాహరణగా నిలుస్తోంది. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించిన మెదక్ జిల్లా సిద్ధిపేట నియోజక వర్గం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. ఈ గొప్ప మార్పుకు చరిత్రకు కారణం సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గ సభ్యుడు మంత్రి హరీష్ రావు కారణభూతులయ్యారు.
సిద్ధిపేటలోని చింతమడక గ్రామంలో హరీశ్ రావు జన్మించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సమీపంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్ పార్లమెంట్‌కు వెళ్ళడంతో, 32 ఏళ్ల వయసులో 2004లో సిద్ధిపేట నియోజక వర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటినుంచి ఎప్పుడు ఎన్నికలోచ్చినా గెలుపు హరీష్‌దే. అంతేగాదు ప్రతి ఎన్నికల్లో మెజారిటీ రెట్టింపు అవ్వాల్సిందే. అదే హరీష్ ప్రత్యేకత.
మాటలో స్పష్టత, ఆకట్టుకునే చిరునవ్వు, శత్రువును సైతం మంత్రముగ్దులను చేసే రాజకీయ వ్యూహాలు ఆయన అలంకారాలు. అనుకువ తప్ప అహంకారం కనిపించని నైజం ఆయనది. చిన్న పిల్లాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ల వరకు ఆయన్ను ఆప్యాయంగా హరీశన్న అని పిలుస్తుంటారు. ఆయనొస్తే.. సొంతమనిషే ఇంటికొచ్చినట్టు భావిస్తారు తెలంగాణ ప్రజలు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఎంత సక్సెస్ అయిందో ప్రపంచమే చెబుతోంది. అందులో ముమ్మాటికి మంత్రి హరీష్ రావు కృషే కారణం. కాకతీయుల గొలుసుకట్టు చెరువులను పునరుద్దరించేందకు ఆయన పరితపించారు. అన్నీ తానే అయి చెరువులలకు జీవం పోశారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న మేనమామ కేసీఆర్ మాటలను ఒంటబట్టించుకున్నారేమో గానీ.. ఎక్కడ అహం కనిపించని మనిషి హరీష్. ఎంత కష్టం వచ్చిన చిరునవ్వు చెరగని మనిషి ఆయన. అలసట కనిపించని లీడర్. మునిపంటికింద కష్టాన్ని తొక్కిపెట్టి, ఆప్యాయంగా పలకరించడం ఆయన నైజం. తెలంగాణ తల్లి దాస్య సృంఖలాలు తెచ్చుకొని, స్వరాష్ట్రంగా అవతరించిన మరుసటి రోజే ఆయన పుట్టిన రోజు కూడా. ఇలాంటి పుట్టినరోజులు హరీషన్న మరెన్నో జరుపుకోవాలని గ్రేట్ తెలంగాణ.కామ్ మనస్పూర్తిగా కొరుకుంటోంది.
Also Read:కాల్షియం తగ్గిందా.. ఇవి తినండి!