హ్యాపీ బర్త్ డే…కీర్తి సురేష్

804
keerthy suresh
- Advertisement -

సినీ ఫీల్డ్ లో గ్లామర్ కు ఉన్న ఇంపార్టెన్స్ ఇంతా అంతా కాదు. అందంగా ఉన్న అమ్మాయిలు మూవీస్ లో దూసుకుపోతున్నారు. కీర్తి పతాకాల్ని ఎగరేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి కోవలో కీర్తి సురేష్ ఉంది. టాలీవుడ్, కోలీవుడ్ లలో ఛాన్సుల మీద ఛాన్సులు కొట్టేస్తున్న ఈ బ్యూటీ పుట్టినరోజు నేడు. కీర్తి పుట్టినరోజు సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

1992 అక్టోబర్ 17లో నిర్మాత సురేష్ కుమార్‌,నటీ మేనకలకు జన్మించింది కీర్తి. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రిచేసిన కీర్తి…2000 సంవత్సరంలో బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. తర్వాత 2013లో విడుదలైన మలయాళం మూవీ గీతాంజలితో హీరోయిన్‌గా పరిచయమైంది.

happy birthday Keerthy Suresh

2015లో కిషోర్ తిరుమల తెరకెక్కించిన నేను శైలజ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది కీర్తి. తర్వాత నాని హీరోగా తెరకెక్కిన నేను లోకల్‌తో మంచి  గుర్తింపు తెచ్చుకుంది.తన నటనతో తమిళ,తెలుగు ఇండస్ట్రీలో అగ్రహీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

తెలుగులో ‘పవన్ కళ్యాణ్’, ‘మహేష్ బాబు’, ‘అల్లు అర్జున్’ ఇలా వరుసగా క్రేజ్ వున్న హీరోలతో హీరోయిన్ గా చేసే అవకాశం కొట్టేసిన ఈ భామ.. తమిళ్ లో అగ్రహీరోలతో జతకడుతోంది. ‘విజయ్’ తో ‘భైరవ  చేసిన ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ ‘సూర్య’, ‘కార్తీ’లతో నటించే ఛాన్స్ అందుకుంది.

happy birthday Keerthy Sureshతెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటి సావిత్రి బయోపిక్‌ సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమాలో కీర్తి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కడమే కాదు జాతీయ ఉత్తమనటి అవార్డును సైతం గెలుచుకుంది. ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న  ఈ భామ మరిన్ని  విజయాలు సొంతం చేసుకుని ప్రేక్షకులను మరింతగా అలరించాలని కొరుకుంటూ greattelangaana.com మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

- Advertisement -