హ్యాపీ బర్త్ డే…నిఖిల్

874
Happy Birthday Hero Nikhil
- Advertisement -

సంబరం సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటుడు నిఖిల్. కెరీర్ ప్రారంభంలో చిన్నచిన్న పాత్రలు వేసిన నిఖిల్ 2007లో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రంతో హీరోగా మారాడు. తర్వాత నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో వచ్చి 13 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఇక ఇవాళ నిఖిల్ పుట్టనరోజు సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ ప్రత్యేక కథనం.

ఇప్పటివరకు 15 సినిమాల్లో నటించిన నిఖిల్‌ రీసెంట్‌గా అర్జున్ సురవరం సినిమాతో హిట్ కొట్టాడు. టాలీవుడ్‌లో తక్కువ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన నిఖిల్ ప్రస్తుతం కార్తీకేయ 2లో నటిస్తున్నారు. కార్తికేయ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుండగా ఇందులో సిక్స్‌ ప్యాక్‌తో కనిపించనున్నారు నిఖిల్.

ఇక రీసెంట్ ఓ ఇంటివాడయ్యారు నిఖిల్. భీమవరానికి చెందిన పల్లవి వర్మను వివాహం చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా జరిగిన వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

తన కెరీర్‌లో స్వామి రారా,కార్తీకేయ, సూర్యా వర్సెస్ సూర్యా,ఎక్కడికి పోతావురా చిన్నవాడ వంటి హిట్ మూవీలు కొట్టిన నిఖిల్..చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తీకేయ 2పై భారీ ఆశలు పెట్టుకున్నారు. నిఖిల్ తన కెరీర్‌లో మరెన్నో హిట్ సినిమాలు తీసి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -