హ్యాపీ బర్త్ డే..బిట్టు

105
ktr minister
- Advertisement -

ఈరోజు నా కుమారుడు బిట్టు అలియాస్ రిషి తేజ పుట్టినరోజు..మీ చల్లని చూపులతో మరియు మీ అమృత హస్తాలతో నా కుమారుని దీవించి ఆశీర్వదించండి సార్ అని తల్లిదండ్రులు కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్‌లో హార్ట్ హోల్ ఆపరేషన్ చేయించారు. హృదయ ఫౌండేషన్ ద్వారా స్టార్ హాస్పిటల్ అధినేత మన్నెం గోపిచంద్ సహకారంతో జర్మనీ నుండి తెప్పించిన డివైస్‌తో ఆపరేషన్ జరిగింది. విజయవంతంగా నాలుగో పుట్టినరోజు జరుపుకుంటున్న నా బిడ్డను ఆశీర్వదించండి సార్ అని తల్లిదండ్రులు కోరారు.

బిట్టుకి జన్మదిన శుభాకాంక్షలు దీర్ఘాయుస్సు, ఆరోగ్యవంతమైన జీవితంతో ఉండాలని ఆకాంక్షించారు మంత్రి కేటీఆర్. బిట్టు పసితనంలో గుండె శస్త్రచికిత్సను అధిగమించి తన 4వ పుట్టినరోజును జరుపుకుంటున్నారని తెలిపారు.

- Advertisement -