హనుమాసనంతో అంగస్తంభన దూరం !

57
- Advertisement -

హనుమంతుడు అత్యంత బలవంతుడిగా పురాణాలు చెబుతున్నాయి. యోగా శాస్త్రంలో హనుమంతుడి బలానికి సూచికగా ” హనుమానసనం ” ను చెప్పుకుంటారు. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల శరీరంలోని అన్నీ అవయవాలకు రక్తప్రసరణ సవ్యంగా జరిగి శక్తినొందుతాయి. ముఖ్యంగా కొన్ని రకాల సమస్యలకు హనుమానసనంతో చక్కటి పరిష్కారం లభిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శృంగార సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ ఆసనం తప్పక వేయాలట. పురుషులలో ఎక్కువగా వేధించే సమస్య అంగస్తంభన ను ఈ ఆసనం దూరం చేస్తుంది. ఎందుకంటే ఈ ఆసనం ద్వారా జననేంద్రియాలకు రక్త ప్రసరణ మెరుగుపడడంతో పాటు అక్కడి అవయవాలకు చక్కటి వ్యాయామంలో ఈ హనుమాసనం పని చేస్తుంది. ఇంకా వీర్య కణాల చలనం చురుకుగా ఉండేలా చూస్తుంది. ఇక మహిళలలో ఋతుక్రమ సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఈ ఆసనం తప్పక వేయాలని యోగా నిపుణులు చెబుతున్నారు.

హనుమాసనం వేయు విధానం
ముందుగా ఈ ఆసనం వేసేటప్పుడు పద్మాసనం వేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎడమ కాలు ను పద్మాసనం నుంచి తీసి ముందుకు చాచి ఉంచాలి. తరువాత కుడి కాలును ఎడమ కాలుకు అపసవ్య దిశలో వెనుకకు చాచి ఉంచాలి. ఇలా చేసిన తరువాత తల మొదలుకొని నడుము భాగం వరకు ముందుకు చాచిన కాలు వైపు ఫోటోలో చూపిన విధంగా చేయాలి. రెండు చేతులను వీలైనంతా పైకి ఎత్తి నమస్కారం పెట్టె విధంగా ఉంచాలి. ఇలా చేసేటప్పుడు శ్వాసక్రియ నెమ్మదిగా జరిగిస్తూ వీలైనంత సమయం వరకు హనుమాసనం చేయాలి.

Also Read: కన్నప్ప షూట్ పూర్తి చేసిన అక్షయ్

గమనిక
శరీరం ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఈ ఆసనం యోగా నిపుణుల పర్యవేక్షణలో వేయాలి. ఉదర భాగంలోనూ జననేంద్రియాలలోనూ ఏవైనా సర్జరీకి గురైన వారు కూడా ఈ ఆసనానికి దూరంగా ఉండాలి.

- Advertisement -