మందుబాబులకు షాక్ న్యూస్..

19
- Advertisement -

మందుబాబులకు బ్యాడ్ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపు బార్లు, వైన్స్ బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో ఉన్న అన్ని వైన్స్, బార్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. నిబంధనలు ఉల్లంఘించి.. ఎవరైనా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మద్యం విక్రయాలను నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్వదినాలు, పండుగ దినాల్లో రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.

Also Read:Harishrao:ప్రశ్నిస్తే కేసులా?ఇదేం పాలన?

- Advertisement -