TTD:ఘనంగా హనుమాన్ జయంతి

9
- Advertisement -

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగావున్న ఆంజనేయస్వామి ఆలయంలో శ‌నివారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఉదయం 7 గంట‌ల‌కు శ్రీ సీతారామ‌ల‌క్ష్మ‌ణ‌స్వామి ఉత్స‌వ‌మూర్తులను శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యానికి వేంచేపు చేశారు. శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు, శ్రీసీతారామ, లక్ష్మణ స్వామివార్ల ఉత్సవర్లకు వైభవంగా అభిషేకం నిర్వ‌హించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీ రామ‌చంద్ర‌మూర్తి హనుమంత వాహనంపై విహ‌రించ‌నున్నారు.

హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. దాస్య‌భక్తికి ప్రతీకగా శ్రీ‌రాముల‌వారు హనుమంత వాహనంపై విహ‌రిస్తారు.

Also Read:తెలంగాణ..ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

- Advertisement -