సంక్రాంతి విన్నర్ ఎవరో తేలిపోయిందిగా!

27
- Advertisement -

ఈ సంక్రాంతికి ఎప్పుడు లేని విధంగా బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోరు నడిచింది. ఏకంగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘ సైంధవ్ ‘, నాగార్జున ‘ నా సామిరంగా ‘ మరియు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్. ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి హంగామాను రెట్టింపు చేశాయి. ఈ నాలుగు సినిమాల్లో మొదటి నుంచి కూడా మహేశ్ బాబు గుంటూరు కారం మూవీపై భారీ హైప్ ఏర్పడుతూ వచ్చింది. అయితే విడుదలైన మొదటి రోజే మూవీ నెగిటివ్ టాక్ మూటగట్టుకోవడంతో అంచనాలు తలకిందులు అయ్యాయి. అయినప్పటికి మహేష్ బాబు పెర్ఫామెన్స్ తో గుంటూరు కారం మూవీ ఇప్పటికే రూ. కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

అయినప్పటికీ ఈ సినిమాకు హిట్ స్టేటస్ దక్కాలంటే మరో రూ.30 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంటుంది. ఇక గుంటూరు కారం మూవీ తర్వాత భారీ హైప్ తో రిలీజ్ అయిన మరో మూవీ హనుమాన్. చిన్న సినిమాగా ప్రారంభమై వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ స్టేటస్ దక్కించుకుంది. ఇక నాగార్జున నా సామిరంగా మూవీ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చి ఈ పండగ సీజన్ లో పరవాలేదనిపించింది. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన ‘ సంధవ్ ‘ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది. మొత్తం మీద ఈ సంక్రాంతికి విడుదల అయిన నాలుగు సినిమాల్లో హనుమాన్ మూవీ విడుదలైన అన్నీ చోట్ల బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో హనుమాన్ మూవీ క్లియర్ సంక్రాంతి విన్నర్ అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

Also Read:మంచు లక్ష్మీ తగ్గిందండోయ్!

- Advertisement -