Hanuman:హనుమాన్..100 డేస్

16
- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ళను రాబ‌ట్టింది.

తాజాగా ఈ సినిమా రిలీజ్ అయి 100 రోజులు అయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ లో ట్వీట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు ప్రశాంత్ వర్మ. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. హనుమాన్ వంద రోజుల వేడుకలను థియేటర్లలో జరుపుకోవడం నా లైఫ్ టైం ఆరాధించే క్షణం. ఈ రోజుతో అది జ‌రిగింది. ఇటీవ‌ల కాలంలో ఒక చిన్న సినిమా వచ్చి థియేట‌ర్‌ల‌లో వంద రోజులు కంప్లీట్ చేసుకోవ‌డం అనేది అరుదు. ఈ మైలురాయిని అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ నా వెన్నంటే ఉండి నాకు మద్దతునిచ్చిన మీడియా మిత్రులకు, నా టీమ్ మొత్తానికి ధన్యవాదాలు అని తెలిపారు ప్రశాంత్.

Also Read:Harishrao:ప్రశ్నిస్తే కేసులా?ఇదేం పాలన?

- Advertisement -