క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘హను-మాన్’. యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ విషయంలో ఇప్పటికే ఈ సినిమా పై బోలెడు నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహేష్ కి పోటీ వచ్చే రేంజ్ ఈ సినిమాకి ఉంటుందా ? అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే, ఎన్ని కాంట్రవర్సీలు కనిపించినా ఈ చిత్రం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.
పైగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తనవంతుగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. మా సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బలంగా నమ్ముతున్నాడు. మరోవైపు హనుమాన్ సినిమాకి క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. అందుకే, హనుమాన్ కి అన్ని ఏరియాల్లోనూ మంచి బిజినెస్ జరిగింది. మరి హనుమాన్ ఏరియాల వారీగా బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం..
వరల్డ్ వైడ్ గా హనుమాన్ సినిమాకి జరిగిన బిజినెస్ లెక్కలు ఏమిటో చూద్దాం రండి.
ఏరియా – బిజినెస్
నిజాం : రూ. 5.50 కోట్లు
సీడడ్ : రూ.3 కోట్లు
ఆంధ్రప్రదేశ్ : రూ.8 కోట్లు
ఆంధ్ర – తెలంగాణ :- రూ.16.50 కోట్లు
కర్ణాటక + ROI : రూ.1.60 కోట్లు
OS – రూ.2 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్ గా హనుమాన్ కి జరిగిన బిజినెస్ – రూ.20.10 కోట్లు
సో.. హనుమాన్ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.21 కోట్లు రావాలి.
Also Read:‘గుంటూరు కారం’ సెన్సార్ రివ్యూ ఇదేనా?