ట్రోలర్స్‌పై హనుమ విహారి

3
- Advertisement -

టీమిండియా సీనియర్ క్రికెటర్, తెలుగు తేజం హనుమ విహారి సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్న ట్రోలర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్ పిచ్‌లపై ఆయన చేసిన విశ్లేషణను తప్పుబడుతూ కొందరు నెటిజన్లు సాగిస్తున్న ట్రోలింగ్‌కు విహారి తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు.

సమకాలీన క్రికెట్ అంశాలపై సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే హనుమ విహారి.. ఇటీవల ఐపీఎల్ పిచ్‌ల స్వభావం, ఆట తీరుపై ఒక విశ్లేషణ చేశారు. అయితే, ఇది నచ్చని కొందరు అభిమానులు ఆయనను ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనిపై స్పందించిన విహారి.. కేవలం ఒకే ఒక్క జట్టుకు గుడ్డిగా సపోర్ట్ చేసే వారికి అంతా పచ్చగానే కనిపిస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. క్రికెట్‌ను నిష్పక్షపాతంగా చూడలేని వారే ఇలాంటి విమర్శలు చేస్తారని మండిపడ్డారు.

తాను ఊరికే విమర్శలు చేయడం లేదని, క్రికెట్‌లో తనకు ఉన్న అనుభవాన్ని బట్టే మాట్లాడుతున్నానని విహారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన కెరీర్ రికార్డులను ట్రోలర్స్‌కు గుర్తు చేశారు.భారత దేశం తరఫున అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం,దేశవాళీ క్రికెట్‌లో 100కు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రికార్డు,టీమిండియా చారిత్రాత్మక విజయాలు సాధించిన రెండు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సిరీస్‌లలో భాగస్వామిగా ఉన్న ఘనత..నన్ను, నా క్రికెట్ పరిజ్ఞానాన్ని విమర్శించే ముందు.. ట్రోల్ చేస్తున్న వారు ఒకసారి వారి సొంత స్టాట్స్ (పరిజ్ఞానం/స్థాయి) ఏంటో చూసుకోవాలి అని హనుమ విహారి పేర్కొన్నారు.

Also Read:IPL:ప్లేఆఫ్స్ రేస్..హోరాహోరీ!

సోషల్ మీడియాలో కేవలం వ్యూస్, లైకులు మరియు రీచ్ (Reach) సంపాదించుకోవడానికే కొందరు కావాలనే తన పేరును వాడుకుంటున్నారని విహారి అభిప్రాయపడ్డారు. “నా పేరు వాడుకోవడం వల్ల మీకు సోషల్ మీడియాలో రీచ్ వస్తుందంటే వాడుకోండి.. దానికి నాకేం అభ్యంతరం లేదు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒక అంతర్జాతీయ క్రికెటర్‌గా పిచ్‌లపై శాస్త్రీయమైన విశ్లేషణ చేసే హక్కు తనకు ఉందని, ఇలాంటి చౌకబారు ట్రోలింగ్స్‌కు తాను భయపడబోనని ఆయన తేల్చి చెప్పారు.

- Advertisement -