యంగ్ హీరోతో హను రాఘవపూడి

21
- Advertisement -

దర్శకుడు ‘హను రాఘవపూడి’కి మంచి క్రేజ్ ఉంది. పైగా, ‘సీతారామం’తో హను రాఘవపూడి హిట్ కొట్టాడు. దీంతో, హను రాఘవపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరిలో ఎంతో ఆసక్తి కనిపిస్తుంది. లవ్ ఎంటెర్టైనెర్స్ నుంచి ‘సీతారామం’ లాంటి సీరియస్ నెస్ సినిమాతో జోనర్ మార్చడంతో ‘హను రాఘవపూడి’ తదుపరి సినిమాని ఏ హీరోతో మొదలు పెడతాడో, ఏ జోనర్ ని సెలెక్ట్ చేసుకుంటాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే, సైలెంట్ గా నెక్స్ట్ సినిమాకి కథని సిద్ధం చేసుకుంటున్న హను రాఘవపూడి తన తదుపరి ప్రాజెక్ట్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.

‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’, ‘పడి పడి లేచె మనసు’, ‘సీతా రామం’ తర్వాత హను రాఘవపూడి మరోసారి యంగ్ హీరో శర్వానంద్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడట. అది కూడా హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా శర్వానంద్ తో సినిమా చెయ్యబోతున్నట్టుగా ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. మరి శర్వానంద్ తో సీతా రామం లాంటి సీరియస్ లవ్ స్టోరీ చేస్తాడో ? లేక, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ లాంటి ఎంటర్ టైనర్ తీస్తాడో చూడాలి. ఈ చిత్రాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించి పట్టాలెక్కించే ప్లాన్ లో ‘హను రాఘవపూడి’ ఉన్నాడు అని సమాచారం.

Also Read:ఎన్టీఆర్ సరసన నటించనుందా?

- Advertisement -