హను-మాన్…థియేట్రికల్ ట్రైలర్

26
- Advertisement -

హను-మాన్ ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ, అలాగే ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఫస్ట్ ఇన్స్టాల్ మెంట్. అన్ని మాధ్యమాల్లో వైరల్‌గా మారిన టీజర్‌తో సినిమాకు నేషనల్ లెవల్ క్రేజ్ ఏర్పడింది. మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆల్బమ్‌లో డిఫరెంట్ స్టయిల్ పాటలు వున్నాయి. తేజ సజ్జ నటించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్.

‘హను-మాన్’ ట్రైలర్‌ను డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ట్రైలర్ పోస్టర్ హీరో కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ కనిపించారు, అతని వెనుక భారీ హనుమాన్ విగ్రహం ఉంది. అంజనాద్రి ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెల్లబోతున్న ఈ ట్రైలర్ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించారు. ఈ మాగ్నమ్ ఓపస్‌కి సినిమాటోగ్రఫీ శివేంద్ర. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల.

అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్ గా కనిపించనున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.హను-మాన్ జనవరి 12, 2024న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ విడుదల కానుంది.

Also Read:ఏపీపై కాంగ్రెస్ ప్లాన్ అదే!

- Advertisement -