క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘హను-మాన్’. టాలెంటెడ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. టీజర్ లో చూపిన విధంగా, హను-మాన్ టాప్-నాచ్ విజువల్ ఎఫెక్ట్స్ తో వుంటుంది.
ఈ చిత్రాన్ని మొదట వేసవిలో మే 12న విడుదల చేయాలని భావించారు. అయితే, అది వాయిదా పడింది. హ్యూజ్ వీఎఫ్ ఎక్స్ వర్క్ ఆలస్యం కావడానికి కారణం. మేకర్స్ ఎలాంటి తొందరపడకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఉన్నారు. ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన టీజర్ లో ఉత్కంఠభరితమైన విజువల్స్ ఉన్నాయి. వీఎఫ్ ఎక్స్ హాలీవుడ్ సినిమాల తో సమానంగా ఉంటుంది. టీజర్ లో మనం చూసినది ఫైనల్ ప్రోడక్ట్ కి సాంపిల్ మాత్రమే. ఆర్ట్‌వర్క్ తో కూడిన హనుమాన్ చాలీసా కూడా భారీ స్పందన వచ్చింది.
‘‘హనుమాన్’ టీజర్‌పై మీరు చూపించిన అపరిమితమైన ప్రేమ మా మనసుని హత్తుకుంది. దీంతో సినిమా విషయంలో మా పై బాధ్యత మరింత పెరిగింది. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేలా, హనుమంతుడి స్ఫూర్తికి అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తామని మాటిస్తున్నాం. బిగ్ స్క్రీన్ పై ‘హనుమాన్’ను మీకు చూపించేందుకు మేము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం.. జై శ్రీరామ్ ’’అని చిత్ర యూనిట్ పేర్కొంది.
హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ విడుదల కానుంది.
హను-మాన్ “అంజనాద్రి” అనే ఊహాత్మక ప్రదేశంలో సెటప్ చేయబడింది. కథానాయకుడు హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాడాడనేది చిత్ర కథాంశంగా తెలుస్తోంది. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Also Read: ఎన్టీఆర్ ను వాడేస్తున్న కుర్ర హీరో
శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
Also Read: పిక్ టాక్ : కుర్ర మనసులను విరగొట్టేసింది
ఈ అద్భుతమైన చిత్రానికి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించగా.. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.