సుచీ లీక్స్‌పై హన్సిక ఏమందో తెలుసా..?

133
Hansika on Suchi leaks

కొలీవుడ్‌ ఇండస్ట్రీని సుచి లీక్స్‌ ఒక్కసారిగా షేక్‌ చేసింది. సింగర్‌ కం యాంకర్‌గా తనదైన ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న సుచిత్ర లీక్స్‌ సినిస్టార్లకి చెమటలు పట్టించాయి. సుచిత్ర ప్ర‌కంప‌నలు ఇటీవ‌ల కాస్త‌ స‌ద్దుమ‌ణిగాయి. కానీ.. ఇప్పుడు మళ్ళీ అడ‌పాద‌డ‌పా ఆ కంప‌నాలు చెల‌రేగుతూనే ఉన్నాయి. సుచి ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా లీకైన సెలెబ్రిటీల రొమాన్స్‌ ఫొటోలు, వీడియోలు సంచలనం సృష్టించాయి.

అయితే ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన ప్ర‌యివేటు బూతు వీడియోలు, ఫోటోలు చూశాక స్టార్లంతా కంగారు పడ్డారు. త‌మ వీడియోలు ఇంకా 1టెరాబైట్ హార్డ్ డిస్క్‌లో నిక్షిప్త‌మై ఉంటే త‌మ ప‌రిస్థితి ఏంకాను? అంటూ ఎవ‌రికి వారు బయాంధోళనలో ఉండిపోయారు. అయితే కొందరు స్టార్లు త‌మ వీడియోలు, ఫోటోలు బ‌య‌ట‌ప‌డిన వెంట‌నే ఏమాత్రం స్పందించ‌లేదు. కానీ తెలివిగా కాస్త ఆలస్యంగా నోరు విప్పుతూ సుచీకి చుర‌క‌లు వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా హాట్‌ భామ హ‌న్సిక త‌నపై చెల‌రేగిన‌ సుచీ లీక్స్ దుమారం గురించి స్పంధించింది.

సుచితో తనకు ఎలాంటి సాన్నిహిత్య‌మూ లేదని, అలాగ‌ని తనతో విరోధ‌ము కూడా లేదని చెప్పింది. నిజానికి దీని వెన‌క ఉన్న అస‌లు వ్య‌క్తి ఎవ‌రో తెలియాలని, అప్పుడు కానీ అస‌లు సంగ‌తి అర్థం కాదు అంటూ కాస్త అయోమయంగానే మాట్లాడింది హన్సిక. అంతేకాకుండా శింబుతో ఎఫైర్ గురించి, క‌టీఫ్ గురించి మాట్లాడుతూ.., శింబు ఓసారి మాట జారాడని, ఒకే ఒక్క మాట వ‌ల్ల హ‌ర్ట‌యిపోయి అత‌డికి గుడ్‌బాయ్ చెప్పేశాన‌ని తేల్చి చెప్పింది హ‌నీ. తెలుగు మ‌ద‌ర్ ఇండ‌స్ట్రీ అయినా త‌మిళంలో బిజీ అయిపోయి ఇక్క‌డ సినిమాలు చేయ‌లేక‌పోతున్నాన‌ని వేరొక ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చింది. మొత్తానికి సుచీలీక్స్ వ్య‌వ‌హారంలో హన్సిక కాస్త హర్ట్‌ అయిందనే తెలుస్తోంది.