దేశముదురు చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటి హన్సిక. ఆ తర్వాత తెలుగు సినిమాలో సరైన గుర్తింపు రాకపోవడంతో కోలివుడ్‌కు షిప్ట్ అయ్యింది. కొలివుడ్‌లో ఈ అమ్మడు టాప్ హీరోయిన్‌గాపేరు సంపాదించుకుంది అగ్ర హీరోలందరి సరసన జోడి కట్టి బాగానే పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ఇంత పాపులర్ అయిన ఈ అమ్మడు తన అందాల ఆరబోత చేయలేదు…కనీసం బికినీ కూడా చూపించలేదు. దీంతో హన్సిక అభిమానులు కాస్త బాధపడేవారు.
తాజాగా హన్సిక నటించిన చిత్రం లక్కున్నోడు జనవరి 26వతేదిన విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హన్సిక మాట్లాడుతూ…దక్షిణాదిన చేనే చేసిన తొలి చిత్రం దేశముదురు. అందుకు నాకు తెలుగు నేల పుట్టిల్లులాంటిది. మిగిలిన ఎన్ని భాషల్లో నటించినా తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టిన ప్రతిసారీ నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది. తమిళంలో చేతినిండా సినిమాలు ఉండటంతో తెలుగులో కాస్త గ్యాప్ వచ్చిన మాట నిజమే.కానీ ఇప్పుడు లక్కున్నోడు విడుదలైంది. ఈ సినిమా విజయంతో తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తాను….జయం రవితో నటించిన తమిళ చిత్రం భోగస్ తెలుగులోకి అనువాదం కానుంది అని పేర్కొంది హీరోయిన్ హన్సిక.
అదేవిధంగా సంపత్‌నంది దర్శకత్వంలో మంచి పాత్ర చేస్తున్నాను. ఆ సినిమాలో బస్తీ అమ్మాయిగా నేను నటిస్తున్నాను… ఇప్పటి వరకు నేను అలాంటి పాత్రలో చూసుకోలేదు అని చెప్పుకొచ్చింది. మహిళా ప్రాధాన్యతగల చిత్రాలను గురించి వివరిస్తూ ‘‘నాకు ఇప్పుడు పాతికేళ్లు. అంటే ఇంకా అమ్మాయినే. అందుకే హీరోల పక్కన రొమాన్స్ చేసే పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాను. మహిళా ప్రాధాన్యం ఉన్న కథల్లో నటించడానికి నాకింకా చాలా టైముంది.’’ అని తెలిపింది. ఆరు నెలల్లో 13 కిలోలు బరువు తగ్గాను…బరవుతగ్గడం కోసం ఎలాంటి డైటింగ్ కూడా చేయలేదు. మా అమ్మ చెప్పిన మోనూని పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యాను అందుకే నేను ఇంత బరువు తగ్గాను అంటూ చెప్పుకొచ్చింది ఈ దేశముదురు బ్యూటీ.