డ్యాన్స్ మాస్టర్ తో హన్సిక రొమాన్స్

240
Hansika floors Prabhu Deva
- Advertisement -

‘దేశ ముదురు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చెన్నయ్ సోయగం హన్సిక మొత్వాని. తొలి సినిమాతోనే కుర్ర కారును కట్టిపడేసింది హన్సిక. ఈ సినిమా తర్వాత హన్సిక పేరు మార్మ్రోగిపోయింది. అవకాశాలు కూడా అలానే వచ్చాయి. ఈ క్రమంలో టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన హన్సిక కొద్ది కాలం తర్వాత కోలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. ఐతే ఇప్పుడు ఆమెకు అవకాశాలు తగ్గాయి. ఇటీవల తెలుగులో గోపీచంద్ సరసన నటించినా హన్సికను ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది.

Hansika floors Prabhu Deva

ఇప్పుడు తాజాగా హన్సిక డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవాతో ఆడిపాడబోతోంది. గులాబాకావ‌లి అనే టైటిల్ తో తెర‌కెక్కుతున్న మూవీలో ప్ర‌భుదేవా, హ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండ‌గా వెట‌ర‌న్ యాక్ట‌ర్ రేవ‌తి కీరోల్ పోషిస్తుంది. కేజేఆర్ స్టూడియోస్ బేన‌ర్ పై క‌ళ్యాణ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ ని హ‌న్సిక తాజాగా త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. ఇది ఓ సాంగ్ కి సంబంధించిన స్టిల్ అని తెలుస్తోంది. గతంలో తన సినిమాలలో రెండుసార్లు ఆమెకు అవకాశం ఇచ్చిన ప్రభుదేవా, ఇప్పుడు మూడో సారి కూడా అవకాశమిచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి వివేక్‌ మెర్విన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -