చేతుల్లో వణుకు..ఈ జబ్బు ఉన్నట్లే!

23
- Advertisement -

చాలామంది చేతులు, కాళ్ళు తరచూ వణికిస్తూ ఉంటారు. ఏదైనా పని చేసేటప్పుడు లేదా ఏదైనా వస్తువును పట్టుకునేటప్పుడు, నడిచేటప్పుడు కొందరిలో వణుకు కనిపిస్తూ ఉంటుంది. కొందరు మాట్లాడేటప్పుడు కూడా తలను వణికించడం, గందరగోళంగా మాట్లాడడం చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఈ సమస్యను నరాల బలహీనత అని భావిస్తుంటారు. అయితే ఇదొక వ్యాధి అని చాలమందికి తెలియదు. దీనిని పార్కింసన్స్ వ్యాధి అంటారు. ఇది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే మెదడుక ఉసంబంధించిన వ్యాధి. శరీరంలో నాడీ కణాల ఆరోగ్యం క్షీణించినప్పుడు ఈ వ్యాధి ఏర్పడుతుంది. సాధారణంగా 60 ఏళ్ల పైబడిన వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నేటి రోజుల్లో యువకుల్లో కూడా ఈ వణుకుడు వ్యాధి కనిపిస్తోంది. ఈ వ్యాధి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే నాడీ వ్యవస్థపై మరింత క్షీణించడం ఖాయమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వ్యాధి స్త్రీల కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, దీనికి సరైన మెడిసన్ లేనందున దీని నుంచి బయట పడేందుకు వైద్యుల సహాయంతో తగు జాగ్రతలు పాటించడం ఎంతో ముఖ్యం.

పార్కింసన్స్ వ్యాధి లక్షణాలు
* మాట్లాడేటప్పుడు తడబడడం, తల వణికించడం.
* నడిచేతప్పుడు కాళ్ళు వణికించడం,
* ఏదైనా పని చేసేటప్పుడు చేతులు వణికించడం.
* చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడిపోవడం.
* ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా ఈ వ్యాధి తాలూకు లక్షనాలే.

నివారణ ; మానసిక ప్రశాంతతను పెంచుకోవడం, వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా మెడిసిన్ తీసుకోవడం, నలుగురితో తమ భావాలను నిర్భయంగా పంచుకోవడం.. ఇలా చేయడం వల్ల ఈ వణుకుడు వ్యాధి నుంచి కొంతైనా బయట పడవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:IPL 2024:సన్ రైజర్స్‌తో తో ఢిల్లీ ‘ఢీ’!

- Advertisement -