పృథ్వీ షా.. 36 బంతుల్లోనే అర్ధశతకం..

108
Prithvi Shaw

ఐపీఎల్‌-2020లో భాగంగా మరో ఆసక్తికర పోరు ఆరంభమైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లు షార్జా వేదికగా తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో యువ ఓపెనర్‌ పృథ్వీ షా అర్ధశతకం సాధించాడు. 36 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో షాకిది ఆరో అర్ధశతకం. క్రీజులో కుదురుకున్న అతడు కోల్‌కతా బౌలర్లపై భారీ షాట్లతో విరుకుపడుతున్నాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి పృథ్వీ 70కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రన్‌రేట్‌ 10కి తగ్గకుండా వేగంగా ఆడుతున్న ఈ జోడీ స్కోరును పరుగులు.