ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకురండి: హరీష్‌ రావు

28
Harish rao

ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా ల‌క్ష్మ‌ణ్ ఉద్యాన వ‌ర్సిటీ ఏర్పాటు చేసి ఏడేండ్లు అయిన సంద‌ర్భంగా అక్క‌డ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశారు.

రైతుల ఖర్చులు తగ్గి లాభాలు వ‌చ్చే వంగడాలను అభివృద్ది చేయాలన్నారు. గ‌త ఏడేండ్ల‌లో కనుగొన్న కొత్త అంశాలు, ప‌రిశోధ‌న‌ల‌ను ప్ర‌ద‌ర్శించారు. ప‌రిశోధ‌న విభాగాల ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌ను హ‌రీశ్‌రావు సంద‌ర్శించారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాలలో, జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం అని తెలిపారు. లాభదాయ సాగుకు ఉద్యానవన వ‌ర్సిటీ తమ వంతు కృషి చేయాల‌న్నారు.

పరిశోధక విద్యార్థులు పరిశోధనల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఉద్యానవన పంటల సాగులో కష్ట నష్టాలను స్వయంగా తెలుసుకోవాలి. ల్యాబ్ టు ల్యాండ్ వెళితేనే ప్రయోజనం ఉంటుంద‌న్నారు.