నేటి రోజుల్లో చాలామంది జుట్టు రాలే సమస్యతో సతమతమవుతుంటారు. ముఖ్యంగా పురుషులను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. జుట్టును కాపాడుకునేందుకు రకరకాల అయిల్స్, క్రీమ్స్, రసాయన మెడిసిన్… ఇలా చాలానే ఉపయోగిస్తుంటారు. అయినప్పటికి జుట్టు రాలడం మాత్రం అదుపులోకి రాదు. దాంతో కొంతమందిలో ఈ సమస్య మానసిక రుగ్మతలకు కూడా దారి తీస్తుంది. అయితే జుట్టు రాలడాన్ని తగ్గించడానికి వివిధ రకాల మెడిసిన్స్ కంటే సహజ సిద్దంగా జుట్టు ఆరోగ్యాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. స్ట్రాబెర్రీ పండ్లు జుట్టు సంరక్షణకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. రుచిలో తీపి పులుపు కలిగిన ఈ పండ్లు తింటే జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయని పలు అధ్యనాలు చెబుతున్నాయి.
ఇందులో ఉండే విటమిన్ కె, డి, సి వంటివి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి, ఒత్తుగా మారెలా చేస్తాయి. ముఖ్యంగా జ్యూసిగా ఉండే స్ట్రాబెర్రీల,ఓ లో ఎల్లాజిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టు పల్చబడకుండా మరియు రాలకుండా నిరోధిస్తుంది. కాబట్టి జుట్టు రాలే సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు స్ట్రాబెర్రీ పండ్లను తింటే కచ్చితంగా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంకా జుట్టు రాలడాన్ని అరికట్టడంలో విటమిన్ బి12 కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి విటమిన్ బి12 ఎక్కువగా ఉండే చేపలు, మాంసం, కూరగాయలు, ఆకుకూరలు వంటివి బాగా తింటే జుట్టు రాలే సమస్య త్వరగా తగ్గుతుంది. విటమిన్ డి లోపం కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. కాబట్టి విటమిన్ డి ఎక్కువగా లభించే గుడ్డు, పాలు, పుట్టగొడుగులు, వంటివి ఆహార డైట్ లో చేర్చుకుంటే మంచిది. ఇంకా జింక్, విటమిన్ సి, లభించే ఆహార పదార్థాలు తీసుకున్న జుట్టు రాలే సమస్యను అధిగమించవచ్చు.
Also Read:పిక్ టాక్ : ఘాటు ఫోజులతో రచ్చ రచ్చ