హద్దు లేదురా..యాక్షన్ కంటెంట్ మూవీ

14
- Advertisement -

ఆశిష్‌ గాంధీ, అశోక్‌ హీరోలుగా వర్ష, హ్రితిక హీరోయిన్లుగా రాజశేఖర్ రావి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”హద్దు లేదురా’. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్ బ్యానర్స్ పై వీరేష్ గాజుల బళ్లారి నిర్మిస్తున్నారు. రావి మోహన్ రావు సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ముఖ్యఅతిధిగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ..”హద్దు లేదురా’.. దర్శకుడు రాజశేఖర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్లు అనిపించలేదు. సినిమా అద్భుతంగా తీశాడు. చాలా మంచి సినిమా అవుతుంది. మొదటి సినిమా బర్త్ లాంటింది. నా మొదటి సినిమా డాన్ శ్రీను ఇప్పటికీ మర్చిపోలేను. మొదటి సినిమా మనం ఇండస్ట్రీకి తెలియజేసే సినిమా. రాజశేఖర్ కూడా అలాంటి మూమెంట్ లోనే వున్నాడు. మొదటి సినిమా కోసం ఫ్రెండ్షిప్ అనే మంచి పాయింట్ తీసుకున్నాడు. ట్రైలర్ చూసినప్పుడు ఫ్రెండ్షిప్ తో పాటు మంచి యాక్షన్ కూడా వుంది. ఆశిష్‌ గాంధీ నేను చేసిన ‘విన్నర్’ లో చేశాడు. తర్వాత నుంచి మంచి నటుడిగా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆశిష్‌ గాంధీ, అశోక్‌ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్. వీరేష్ చాలా పాషన్ తో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా మంచి హిట్ కావాలని నిరూపించుకున్నాడు. నేను బాలయ్య బాబుకి ఎంత పెద్ద అభిమానినో రాజశేఖర్ కూడా అంతే పెద్ద ఫ్యాన్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. మార్చి 21న సినిమా విడుదలౌతుంది. సినిమాని మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

ఆశిష్‌ గాంధీ మాట్లాడుతూ.. నాటకం సినిమా టీజర్ లాంచ్ కి గోపీచంద్ గారు వచ్చారు. అదే సెంటిమెంట్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్షిప్ మూవీ. రాజశేఖర్ చాలా పాషన్ తో సినిమా చేశారు. నిర్మాతలు బ్యాక్ బోన్ గా నిలబడి ఈ సినిమాని ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.” అన్నారు.

దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకులు గోపీచంద్ మలినేని గారికి ధన్యవాదాలు. జీవితాన్ని నచ్చినట్లు బ్రతకాలని చెబుతూ ఈ చిత్రానికి హద్దులేదురా అనే టైటిల్ పెట్టడం జరిగింది. లక్ష్యం చేరుకునే వరకూ హద్దు ఉండకూడదు. నిర్మాత వీరేష్ అద్భుతంగా సపోర్ట్ చేశారు. ఆశిష్‌ గాంధీ, అశోక్‌ తో పాటు మిగతా నటీనటులంతా అద్భుతంగా నటించారు. సినిమా యూనిట్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.

Also Read:లవ్ గురు..అందమైన లవ్‌స్టోరి

- Advertisement -