మరో సినీ జంట బ్రేకప్!

20
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేవి కామన్ అయిపోయాయి. ఎంతో స్టార్ హీరోలు, హీరోయిన్లు వివాహం చేసుకుని విడాకులు తీసుకోగా తాజాగా ఈ బాటలో చేరిపోయారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్.

కోలీవుడ్‌లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా తన 11 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్ చెప్పారు. తన భార్య సైంధవితో విడిపోయినట్లు ప్రకటించారు జీవీ ప్రకాష్.

మా మానసిక శాంతి మరియు మెరుగుదల కోసం. పరస్పర గౌరవాన్ని కాపాడుకుంటూ విడిపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ తమ గోప్యతను అర్థం చేసుకోవాలని కోరారు. జివి ప్రకాష్ ఆస్కార్ అవార్డు గ్రహీత స్వరకర్త ఎఆర్ రెహమాన్ మేనల్లుడు. 2013లో సైంధవిని వివాహం చేసుకున్నారు. సైంధవి సింగర్‌.

Also Read:‘పదహస్తసనం’తో ఆ సమస్యలు దూరం!

- Advertisement -