జీవీ ప్రకాశ్‌..కింగ్‌స్టన్ ట్రైలర్‌

1
- Advertisement -

తమిళ సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్రకాశ్‌ కుమార్ హీరోగా కమల్ ప్రకాశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్‌స్టన్‌’.దివ్య భారతి హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా మార్చి 07న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తూత్తుకుడి స‌మీపంలోని స‌ముద్రంలో ఒక ప్రదేశం శాపగ్రస్తమై ఉంటుంది. చేప‌లు ప‌ట్ట‌డానికి అటు వెళ్లిన ప్ర‌జ‌లు అక్క‌డే మ‌య‌మై పోవ‌డం.. వారికోసం వెళ్లిన జ‌నాలు క‌నిపించ‌కుండా పోవ‌డం జ‌రుగుతుంది. అయితే దేవుడు అంటే న‌మ్మ‌కం లేని కింగ్‌స్ట‌న్ (జీవీ ప్రకాశ్‌ కుమార్) అస‌లు అక్క‌డ ఉన్న ర‌హ‌స్యం ఏంటి అని క‌నిపెట్టడానికి వెళ‌తాడు. అయితే కింగ్‌స్ట‌న్ అక్క‌డికి వెళ్లిన అనంత‌రం జ‌రిగిన ప‌రిస్థితులు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read:AP Budget 2025-26: ఏపీ బడ్జెట్ హైలైట్స్

- Advertisement -