కరోనా బాధితుల్లో మనోధైర్యం నింపండి:గువ్వల బాలరాజు

265
guvvala balraju
- Advertisement -

కరోనా వైరస్ విజృంభించకుండా ప్రభుత్వ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తూ కట్టడి చేయడంతో పాటు. కరోనా సోకిన వారు కరోనా జయించే వరకు. వారికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదేశించారు.

హైదరాబాదు లోని తన స్వగృహం నుంచి అచ్చంపేట నియోజకవర్గంలో కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్న జాగ్రత్తలపై. కలెక్టర్ శర్మన్, వైద్యాదికారి సుధాకర్ లాల్ ,వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులతో.ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కరోనా సోకిన వారిలో మనో ధైర్యాన్ని నింపి, వారికి కావాల్సిన వైద్యంతో పాటు అన్ని సేవలు అందించాలన్నారు.కరోనాను జయించిన వారిని ప్లాస్మా దానం చేసే విదంగా ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది కరోన నివారణ సేవల్లో పాలు పంచుకుంటున్న వారందరిని గువ్వల బాలరాజు అభినందించారు. రాబోయే రోజుల్లో. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరం మరింత కృషి చేద్దామన్నారు.

- Advertisement -