కరోనా యోధులకు గవర్నర్ తమిళి సై సన్మానం..

222
tamilisai
- Advertisement -

హైదరాబాద్ సనత్‌ నగర్‌లోని ఈఎస్‌ఐసీ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందికి సన్మానం చేశారు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌. క్లిష్ట పరిస్ధితుల్లో పని చేస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు.

కరోనా వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని ఈ సమయంలో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత వైద్య సిబ్బంది పై ఉందన్నారు. ఈఎస్‌ఐ,డీఆర్డీవో కలిసి కరోనాను ఎదుర్కొనేందుకు పరిశోధనలు చేస్తున్నారని తెలిపారు.

వైద్యులు, వైద్య సిబ్బంది ముందుండి కరోనా తో పోరాడుతున్నారని…కరోనాను ఎదుర్కోవడంలో ప్రపంచంలో భారత్ ముందుందన్నారు. వైద్యులు అంకితభావం తో పని చేస్తున్నారని…అందుకే దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందన్నారు.

లాక్ డౌన్ వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించగలిగామని…మనం మనం ముందుగానే అప్రమత్తం అవ్వడం లాక్ డౌన్ విధించుకోవడంతో ఈ వైరస్ ప్రభావం మన దగ్గర తక్కువగా ఉందన్నారు.

ఈ సమయంలో కరోనా లేని, సాధారణ రోగులను కాపాడుకోవాలని…ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనం ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సిబ్బంది ఈ వైరస్ మీద చాలా బాగా పని చేస్తున్నారని…కరోనా చాలా పద్ధతులు నేర్పిందన్నారు.

వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం అని తెలిపిన గవర్నర్…కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కలిసి కట్టుగా పని చేస్తున్నాయని తెలిపారు.

- Advertisement -