పేదల సంక్షేమానికి పెద్దపీట…

203
- Advertisement -

సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో గవర్నర్‌ నరసింహాన్‌ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గోన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్‌ నరసింహన్‌ 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రం బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకెళ్తుందని… ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలతో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

Guv greets people on Republic Day

కోటి ఎకరాలను మాగాణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని. మిషన్‌ కాకతీయతో కాలువలకు,చెరువులకు పునర్జీవం వస్తుందని.ఇంటింటికి సురక్షిత మంచినీళ్లు అందించేందుకు మిషన్‌ భగీరథను అమలు చేస్తున్నాట్లు ఆయన పేర్కొన్నారు. 31జిల్లాలతో తెలంగాణ పరిపాలన సాగుతోందని…రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పెద్ద ఎత్తున్న ప్రాజెక్టులు నిర్మాణ చేపడుతున్నట్లు గవర్నర్‌ వెల్లడించారు

రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అర్హులందరికీ పించన్లు అందిస్తుంది. పేదల సొంతింటి కల తీర్చేందుకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపడుతున్నది. డిసెంబర్‌లో నర్సన్నపేట, ఎర్రవల్లిలో డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. 3600కు పైగా దళిత కుటుంబాలకు మూడెకరాల భూపంపిణీ చేపట్టినట్లు పేర్కొన్నారు. 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించబోతున్నాం. హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం పెడుతున్నాం. 35 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. రంజాన్, క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం. వేద పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాం. నగదు రహిత లావాదేవీలోల సిద్ధిపేట టాప్ ప్లేస్‌లో నిలిచింది. మహిళల రక్షణకు షీ టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు.

- Advertisement -