ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా

422
Gutha-Sukhender-Reddy
- Advertisement -

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల నామినేషన్‌ ఉపసంహరణకు గడువు ముగియటంతో.. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గుత్తా సుఖేందర్‌రెడ్డి అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు నుంచి ధ్రువ పత్రం అందుకున్నారు.

ఈకార్యక్రమంలో మంత్రులు జగదీష్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ లింగయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.ఈసందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన నాకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్నతలు తెలిపారు. నా గెలుపుకు సహాకరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్సీ పదవిని ప్రజా సేవకే వినియోగిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా రైతులకు సేవ చేసే అదృష్టం కల్పించేందుకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్నతలు తెలిపారు.

- Advertisement -