కేంద్ర ప్రభుత్వ తీరుపై తనదైన శైలీలో మండిపడ్డారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన గుత్తా..ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ రాష్ట్రాల అస్తిత్వాన్ని దెబ్బతీయలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు తెలంగాణ పరువు పోయేలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాకు చెందిన పార్థసారథిరెడ్డి హెటిరో ఫార్మాతో దేశ అభివృద్ధికి పాటు పడ్డారని చెప్పారు. అలాంటి వ్యక్తికి సీఎం కేసీఆర్ రాజ్యసభ ఇవ్వడం హర్షనియం అన్నారు. ప్రతిపక్ష నాయకులు నేడు కులాల గురించి మాట్లాడుతున్నారని, అధికార యావ తప్ప వారికి వేరే ప్రాధాన్యం లేదని విమర్శించారు.
తమకు అభివృద్ధి ముఖ్యమని, కులాలు కాదని చెప్పారు. కొన్ని శక్తులు కులాల పేరుచెప్పుకొని అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయని, అందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు.