వివక్షతపై పోరాడిన ధీశాలి అంబేద్కర్: గుత్తా

218
gutha-sukender-reddy
- Advertisement -

అంటరానితనం, వివక్షతపైన పోరాడిన ధీశాలి,ఆర్ధికవేత్త, న్యాయకోవిదుడు,రాజనీతజ్ఞుడు,భారత రాజ్యాంగ నిర్మాత , భారతరత్న, డా ” బి ఆర్ అంబెడ్కర్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో డా ” బి ఆర్ అంబెడ్కర్ గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి .

నివాళులు అర్పించిన తరువాత మాట్లాడిన శాసన మండలి చైర్మన్ ఆర్థిక శాస్త్రం, న్యాయశాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి అనేక శాస్త్రాల‌ను, ప్ర‌పంచంలోని అనేక రాజ్యాంగాల‌ను చదివిన అప‌ర మేధావి అంబేద్క‌ర్ గారు అని ఆయన కొనియాడారు.

అంబెడ్కర్ గారి ఆశయాల సాధనకు అనుగుణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. అంబేద్క‌ర్ ఆలోచ‌నా ధోర‌ణినే ముఖ్యమంత్రి గారి ఆలోచన దొరణిగా ఉందన్నారు. మన తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పడానికి గర్వపడుతున్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అన్నారు.

ద‌ళిత బ‌హుజ‌నుల కోసం మ‌న రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న‌న్ని ప‌థ‌కాలు మ‌రే రాష్ట్రంలోనూ లేవ‌ని ఆయన చెప్పారు . అంబేద్క‌ర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ,చట్టాలను గౌరవిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తూ అంబెడ్కర్ గారి ఆశయల సాధన కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని శాసన మండలి చైర్మన్ గారు కోరారు.

- Advertisement -