- Advertisement -
మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని కత్తుల అలివేలు పై చదువులకు ఆర్ధిక సాయం అందించారు.
రంగారెడ్డి జిల్లా మొహినాబాద్లోని భాస్కర మెడికల్ కళాశాలలో కత్తుల అలివేలుకు ఎంబీబీఎస్ సీట్ లభించింది. అయితే ఆ కళాశాలలో చేరడానికి ట్యూషన్ ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని కలిసి తన పరిస్థితిని వివరించారు.వెంటనే ఆ అమ్మాయి చదువుకు అవసరమైన 50,000 రూపాయల సహాయాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి తన తండ్రి కీర్తిశేషులు గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరపున అందించారు.
ఈ సందర్భంగా వారు గుత్తాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -