- Advertisement -
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి చైర్మన్ పదవికి మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎంచుకున్నారు. శాసనమండలి చైర్మన్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శాసనమండలి చైర్మన్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం నాడు నామినేషన్ దాఖలు చేశారు.
అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో సుఖేందర్ రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు. మండలి చైర్మన్‌గా రెండోసారి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ పదవి ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీల సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో మాదిరిగా మండలిని హుందాతనంగా నడిపేందుకు కృషి చేస్తానని చెప్పారు.
- Advertisement -