నెల్లికల్ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ చొరవేనన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గుత్తా…తానొక్కడినే నెల్లికల్ ప్రాజెక్టు కోసం తపన పడినట్లు జానారెడ్డి చెప్పుకోవడం సరికాదని అన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనూ అన్ని విధాలా ప్రయత్నం చేశానని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి అన్ని అనుమతులు వచ్చేలా కృషిచేసి ప్రారంభోత్సవం చేయించాం…. ప్రాజెక్టు అనుమతులు కోసం జానారెడ్డి చుట్టపుచూపుగా మాత్రమే తిరిగారని వెల్లడించారు.ఈ పథకం ప్రారంభం నాటికి జానారెడ్డి సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇండ్ల నిర్మాణం కోసం స్థలం చూపని కారణంగానే నిర్మాణం అలస్యమైంది. తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ పట్టుదల, ఉద్యమ స్ఫూర్తే కారణం అని చెప్పారు.
డబుల్ బెడ్రూంల నిర్మాణంపై ప్రశ్నించే అధికారం జానారెడ్డికి లేదని… దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఏడేండ్లలో సాగర్ నియోజకవర్గాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతగానో అభివృద్ధి చేసింది. అందుకే ఉప ఎన్నికలో పార్టీ నాయకులు ధైర్యంగా ప్రజలను ఓట్లు అడుగుతున్నారు…జానారెడ్డి అసత్య ప్రచారాలు మానుకొని, తన హుందాను కాపాడుకునేలా ప్రచారం చేయాలన్నారు.