సిర్సాలోని డేరా సచ్చా సౌధాలో గుర్మీత్ రాం రహీం సింగ్ సాగించిన అకృత్యాలు ఒక్కొక్కటిగా భయటకు వస్తున్నాయి. గుర్మీత్ సింగ్ దగ్గర బాడీగార్డ్‌గా పనిచేసిన బియాంత్ సింగ్ జాతీయ న్యూస్ ఛానల్‌కు సంచలన విషయాలు వెల్లడించాడు. డేరాలో ఆశ్రమంలో పనిచేసే 300 మంది సాధ్వీలలో 90 శాతం మహిళలను గుర్మీత్ వాడుకున్నాడని తెలిపాడు. గుర్మీత్ మహిళలను తన రూంకి పిలిపించుకొని, వారితో అసభ్యకరమైన పనులు చేయించుకునేవాడని బియాంత్ తెలిపాడు. 1995లో మౌంట్ అబులో జరిగిన ఓ ఘటనలో తాను ప్రత్యక్ష సాక్షినన్న బియాంత్.. గుర్మీత్ సింగ్ 16 ఏళ్ల బాలికను తన రూంకి తీసుకెళ్లి గంటలకొద్ది రేప్ చేశాడని వెల్లడించాడు. ఆమెను ఇప్పటికీ డేరాలోనే బందించినట్టు తెలిపాడు.
గుర్మీత్ దగ్గర పనిచేసే ప్రతీ సెక్యురిటీ గార్డుకు లోపల నిస్సహాయంగా బాధకు గురౌతున్న మహిళల అరుపులు వినిపించేవని, వాళ్లు గుర్మీత్‌ను ఆపే ధైర్యం చేసేవారు కాదని చెప్పాడు బియాంత్. బాబా అరాచకాలను తట్టుకోలేక భయటపడాలనుకున్న తనను నపుంసకుడిగా మార్చే ప్రయత్నాలు జరిగాయన్నాడు. ఆ సమయంలోనే డేరా నుంచి తప్పించుకొని భయటపడి, విదేశాల్లో తలదాచుకున్నానని బియాంత్ తెలిపాడు.
గుర్మీత్ రాం రహీం సింగ్ హత్యలు, భూకబ్జాలకు కూడా పాల్పడ్డాడని బియాంత్ సింగ్ తెలిపారు. గుర్మీత్ ఆశ్రమంలో నల్లధనం, అక్రమ ఆయుధాలు భారీగా పోగుపడి ఉన్నాయని ఆయన తెలిపారు. ఆర్డీఎక్స్ లాంటి పేలుడు పదార్థాలు కూడా ఉండడం విశేషమని ఆయన తెలిపారు.
గుర్మీత్ సింగ్ చేయని దారుణం లేదని, హత్యలు చేయడం ఆయనకు సర్వసాధారణమని అన్నారు. ఏదైనా భూమి మీత అతని కన్ను పడితే, వెంటనే తన గూండాలను ఆ స్థలంపైకి పంపేవాడని గుర్తు చేసుకున్నారు. అక్కడ వారు మలమూత్ర విసర్జన చేసేవారని అన్నారు. అలా చేసిన తరువాత ఆ భూమిని దాని యజమాని ఎట్టిపరిస్థితుల్లో బాబాకే విక్రయించాలని ఆయన అన్నారు.
అలా చేయకపోతే తీవ్రపరిణామయాలు ఎదుర్కోవాల్సి ఉండేదని ఆయన తెలిపారు. పోనీ ఆ భూమికైనా సరైన ధరకట్టేవాడా? అంటే, అది కూడా జరిగేది కాదని, 20 లక్షల రూపాయల విలువైన భూమికి కేవలం ఒకటి, లేదా రెండు లక్షల రూపాయలు చేతిలో పెట్టేవాడని ఆయన చెప్పారు. ఆ ధరకు ఇవ్వమని ఎవరైనా మొండికేస్తే…ఆ భూమిని కబ్జా చేసేవాడని ఆయన తెలిపారు.