వివాదాల రాక్ స్టార్ బాబా..!

192
Gurmeet Ram Rahim Case details
- Advertisement -

బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌…. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. డేరా సచ్చా సౌదా మత గురువుగానే కాకుండా ఎమ్ఎస్‌జీ  సినిమాతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోయింది. ఈక్రమంలో అనేక వివాదాల్లో చిక్కుకున్న గుర్మీత్‌ను పూజించే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు.

పూర  సచ్చా పేరుతో స్థానికంగా ఓ దిన పత్రికను నడిపే జర్నలిస్ట్ ఛత్రపతి సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో ఇద్దరు మహిళలపై గుర్మీత్ బాబా అత్యాచారానికి పాల్పడినట్లు 2002లో బయటపెట్టారు. రామ్ రహీమ్ సింగ్ లైంగిక వేధింపులను బయటపెట్టిన కొద్ది నెలల తర్వాత అంటే 2002 అక్టోబరు 24 న జర్నలిస్ట్ ఛత్రపతి పాయింట్ బ్లాక్‌పై తుపాకితో కాల్చుకుని తన నివాసం సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో 2002 డిసెంబరు 12 న సీబీఐ కేసు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376, 506, 509 కింద కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.

పంజాబ్,హర్యానాలోని వెనుకబడినవర్గాలకు చెందిన ప్రజలు సమాజంలోని వివక్షను భరించలేక డేరాల్లో చేరుతుంటారు. డేరా సచ్చాసౌధాను 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు నెలకొల్పాడు. ఆయన బోధనలకు లక్షలాది మంది ఆకర్షితులయ్యారు. ఈ సంప్రదాయంలో కులాల వంటి అడ్డుగోడలుండవు. దీంతో ఎంతో మంది నిమ్నజాతీయులు డేరా సచ్చాసౌధా చేరడానికి ఆసక్తిని కనబరుస్తారు. ప్రార్థనల కోసం నామ్‌ చర్చాఘర్‌లను నిర్మించుకున్నారు. డేరాల్లో శ్రీమంతుడినైనా, బీదవాడినైనా ఒకే రకంగా పరిగణిస్తారు. పంజాబ్‌, హర్యానాల్లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో లక్షలాది మంది దళితులు గుర్మీత్‌ బోధనల పట్ల ఆకర్షితులై అందులో చేరారు.

డేరాసచ్చాసౌదాను యూనిట్లుగా విభిజించి….ప్రతి యూనిట్‌కు బాధ్యుడిగా భంగీదాస్‌ వ్యవహరిస్తారు. సభ్యుల ఇబ్బందులను తెలుసుకొని కేంద్ర కార్యాలయమైన సిర్సాకు తెలియచేయడం వీరి ప్రధాన విధి. అనారోగ్యంగా ఉన్న వారి గురించి తెలియజేయడంతోపాటు వారిని చికిత్స కోసం సిర్సాకు తీసుకువెళుతారు. ఇక్కడ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఆసుపత్రి ఉంది. ఇందులో ఉచితంగా చికిత్సలు నిర్వహిస్తారు.

ఎలాంటి అవినీతి కనిపించదు. ఇది డేరాల్లోని పేదలకు ఎంతగానో లాభిస్తుంది. పంజాబ్‌లోని సంగ్రూర్‌, బర్నాలా, మాన్స, భటిండా, ఫజిల్కా, ఫరీద్‌ కోట్‌, ఫిరోజ్‌పూర్‌ జిల్లాల్లో డేరా వర్గీయులు అధికంగా ఉన్నారు. క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా సిర్సాలో ఉచితంగా చికిత్స చేయడం విశేషం. ఇన్ని ప్రజాపయోగమైన కార్యక్రమాలు చేపడుతుండటంతో డేరా సచ్చాసౌధాలో లక్షలాది మంది సభ్యులుగా చేరారు.

- Advertisement -