క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా, బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, S.K. సత్య తెరకెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు. ఈ సినిమా చిత్రీకరణ అంతా పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అశేష స్పందన లభిస్తుంది. మనోజ్ గత చిత్రాలను మైమరింపచేసేలా, ఈ మాస్ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.
మంచు మనోజ్ నటించిన గుంటూరోడు ఆడియోని తొలుత రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ, ఏపి ప్రత్యేక హోదా విషయంలో 26న విశాఖ బీచ్‌లో పవన్‌కళ్యాన్ తలపెట్టిన స్పెషల్‌స్టేటస్‌కు మద్దతుగా ఈ ఆడియో వేదికను వాయిదా వేసుకున్నారు. ఈసందర్భంగా మనోజ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని ఈనెల 29 హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్‌లో ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ ఆడియో ఫంక్షన్‌కు ముఖ్యఅతిధిలుగా సాయి ధరమ్ తేజ్, శర్వానంద్, నాని అండ్ రకుల్ ప్రీత్ సింగ్ హాజరుకానున్నారు. ఈ సినిమాతో సత్య అనే దర్శకుడు చలన చిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్నాడు. ఎస్.కె. సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ అట్లూరి ప్రసాద్ సమర్పణలో శ్రీవరుణ్‌అట్లూరి నిర్మిస్తున్నారు. మనోజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.