వీడియో దుమ్మురేపుతోంది.. కానీ

56
- Advertisement -

దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం నుంచి నిన్న మూవీ టైటిల్ తో పాటు.. గింప్ల్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ స్ట్రైక్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో అదిరిపోయింది. ముఖ్యంగా ఈ మాస్ స్ట్రైక్ వీడియో యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. కేవలం 16 గంటల్లోనే ఈ వీడియోకి 17 మిలియన్ల వ్యూస్, 3.11 లక్షల లైక్స్ వచ్చాయి అంటేనే.. గుంటూరు కారం సినిమా పై ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. పైగా ఇప్పటికీ యూట్యూబ్ లో గుంటూరు కారం వీడియో నెంబర్-1లో స్థానంలోనే కొనసాగుతుంది.

ఐతే, ఈ సినిమాకు ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ఫిక్స్ చేయడం పైనే కొందరు ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. మహేష్ బాబు స్వస్థలం గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామం. గతంలో తన గ్రామం మీద ఉన్న అభిమానంతో సూపర్ స్టార్ కృష్ణ ‘బుర్రిపాలెం బుల్లోడు’ అనే సినిమా కూడా చేసి హిట్ కొట్టారు. ఐతే, ఆ రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ఇప్పుడు మహేష్ బాబు కూడా తన ప్రాంతం పేరునే తన సినిమాకి టైటిల్ గా పెట్టుకోవడం పక్క ప్రాంతం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే, గుంటూరు కారం లాంటి మాస్ టైటిల్ అవసరమా అంటూ కూడా కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే గుంటూరు కారం అనే టైటిల్ మరీ మొరటుగా ఉంది. అసలు త్రివిక్రమ్ లాంటి క్లాసిక్ డైరెక్టర్ నుంచి ఇలాంటి పక్కా కమర్షియల్ మాస్ టైటిల్ ఎక్స్ పెక్ట్ చేయడం కూడా కష్టమే. ఏది ఏమైనా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా మాస్ స్ట్రైక్ వీడియో కూడా అదిరిపోయింది. అన్నట్టు ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు.

- Advertisement -