‘గుంటూరుకారం’ హిట్ అవ్వాలంటే?

30
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా ‘ గుంటూరుకారం ‘ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో చిత్రం కావడంతో గుంటూరు కారం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మూవీలో మహేష్ క్యారెక్టరైజేషన్ ఊర మాస్ గా ఉండబోతుందని ట్రైలర్ బట్టి ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఇటీవల గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ.. గుంటూరు కారం మూవీలో కొత్త మహేష్ ను చూస్తారని స్వయంగా చెప్పడంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయింది. మూవీ బిజినెస్ పరంగా కూడా కొత్త రికార్డులను నమోదు చేసింది. .

ఏరియా వైడ్ గా ఈ మూవీ చేసిన బిజినెస్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నాయి. నైజాం రూ.42 కోట్లు, సీడెడ్ రూ.14 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.14 కోట్లు, ఈస్ట్ ఆంధ్రా రూ.8.6 కోట్లు, వెస్ట్ ఆంధ్రా రూ.6.6 కోట్లు, గుంటూరు రూ.7.65 కోట్లు, కృష్ణ రూ.6.5 కోట్లు, నెల్లూరు రూ.4 కోట్లు, కర్ణాటక & ఇతర రాష్ట్రాలు రూ.9 కోట్లు, ఓవర్సీస్ రూ.20 కోట్లు.. ఇలా ఓవరాల్ గా 132.25 కోట్లు బిజినెస్ చేసింది. గతంలో మహేష్ బాబు సినిమాలతో పోలిస్తే గుంటూరు కారం చేసిన బిజినెస్ చాలా ఎక్కువ. దాంతో గుంటూరు కారం హిట్ మూవీగా నిలవాలంటే రూ.130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. మరి ఈ స్థాయి వసూళ్లను మహేష్ బాబు అందుకుంటాడా అనేది చూడాలి. మహేష్ బాబు మూవీ కి యావరేజ్ టాక్ వచ్చిన మూవీ వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయం. ఆ విధంగా చూస్తే గుంటూరు కారం హిట్ లిస్ట్ లో చేరడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

Also Read:Venkatesh:‘సైంధవ్’నా కెరీర్ లో డిఫరెంట్ మూవీ

- Advertisement -