95 ఏళ్ల వయస్సులో సర్పంచ్..కేసీఆర్ విషెస్

5
- Advertisement -

మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి, సర్పంచ్ గా గెలిచిన 95 ఏండ్ల గుంటకండ్ల రామచంద్రా రెడ్డిని బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు. తుంగతుర్తి నియోజకవర్గం,నాగారం గ్రామ పంచాయతీ నుంచి 95 సంవత్సరాల వయసులో, పూర్తి ఆరోగ్యంగా ఉన్న గుంటకండ్ల రామచంద్రారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. హోరాహోరీ పోరులో ప్రత్యర్థి మీద విజయం సాధించారు.

కాగా , ఈ విషయం (( రామచంద్రా రెడ్డి కుమారుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ( మాజీ మంత్రి) ద్వారా)) తన దృష్టికి వచ్చిన సందర్భంలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు. 100 ఏళ్లకు దగ్గరగా ఉన్న ఒక పెద్ద మనిషి నేటి యువతతో పోటీపడుతూ ప్రజాసేవకు ముందుకు రావడం, ఎన్నికల బరిలో నిలవడం, ప్రజల ఆదరణ పొందుతూ గెలవడం, అనేది ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో చాలా అరుదైన విషయం అని కేసీఆర్ గారు భావించారు.
సంతోషం వ్యక్తం చేస్తూ,ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

రామచంద్ర రెడ్డిని అభిమానంతో గెలిపించిన నాగారం గ్రామ ప్రజలను, మద్దతుగా నిలిచిన బి ఆర్ ఎస్ గ్రామ కార్యకర్తలను, నాయకులను అధినేత కేసీఆర్ అభినందించారు. రామచంద్రారెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నాగారం గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని కేసీఆర్ అభిలషించారు.

Also Read:మంత్రి కొండాపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

- Advertisement -