అమెరికాలో కాల్పుల కలకలం

89
us
- Advertisement -

అమెరికాలో గన్ కల్చర్ ఆగడం లేదు. ఓ స్కూల్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యూ ఓర్లీన్స్‌ హైస్కూల్‌ స్నాతకోత్సవంలో మంగళవారం కాల్పులు ఘటన చోటు చేసుకోగా ఓ మహిళ మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. అయితే, కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదు.

కాల్పులకు పాల్పడిన అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతవారం టెక్సాస్‌లోని ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 19 మంది చిన్నారులు సహా పలువురు మరణించిన విషయం తెలిసిందే.

- Advertisement -