ఢిల్లీ చేరుకున్న గల్ఫ్ బాధితులు…

825
gulf victims
- Advertisement -

సీఎం కేసీఆర్,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఢిల్లీ చేరుకున్నారు గల్ఫ్ బాధితులు. గల్ఫ్‌లో అష్టకష్టాలు పడుతు..ఇంటికి రాలేక ఇబ్బందులు పడుతున్న తాము ప్రభుత్వం చూపించిన చొరవతో భారత్ చేరుకున్నామని గల్ఫ్ బాధితులు తెలిపారు.

చాగల్ అశోక్ అనే కార్మికుడు 11సంవత్సరాల క్రితం మలేషియా ఉపాధి నిమిత్తం వలస వెళ్ళాడు .అక్కడి నుండి స్వదేశానికి రాలేని పరిస్థితి.రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన యాదయ్య 7సంవత్సరాల క్రితం సౌదీ వెళ్ళాడు అప్పటి నుండి తిరిగి రాలేదు.

పెగడపెళ్లి గ్రామానికి చెందిన పోతుగండు మోడీ 15సంవత్సరాల కింద దుబాయి వెళ్ళాడు ఇప్పుడు స్వదేశానికి తిరిగి రాని పరిస్థితిలో ప్రభుత్వం చొరవతో స్వదేశానికి చేరుకున్నారు.

వీరితో పాటు ఏజెంట్ల చేతిలో మోసపోయి మంచిర్యాల జిల్లా కవ్వాల్ గ్రామానికి చెందిన కుంటాల లచ్చన్న ,శేర్ల రాజు అనే ఇద్దరు కార్మికులను ఇరాక్ లో ఇరాక్ పోలీస్ లు అక్రమంగా అరెస్ట్ చేశారని వారిని స్వదేశానికి తీసుకువచ్చేలా ఏర్పాట్లుచేయాలన్నారు గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాట్కూరి బసంత్ రెడ్డి.

- Advertisement -