- Advertisement -
ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా మరో ఆసక్తికర పోరు జరిగింది. హైదరాబాద్ విధించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని నమోదుచేసింది. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్…చిరస్మరణీయమైన విజయాన్ని నమోదుచేసింది. చివరి ఓవర్‌లో 22 పరుగులు చేయాల్సి ఉన్న తరుణంలో రషీద్ ఖాన్ మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లో 3 సిక్సర్లతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
మాన్ సాహా (68), శుభ్‌మన్ గిల్ (22), హార్దిక్ పాండ్యా (10), డేవిడ్ మిల్లర్ (17) పరుగులు చేశారు.. రాహుల్ తెవాటియా 21 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. రషీద్ ఖాన్ కలిసి గుజరాత్‌ను విక్టరీలో కీలక పాత్ర పోషించాడు.
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు చేసింది.అభిషేక్ శర్మ 65, మార్కమ్ 56 పరుగులతో రాణించారు.
- Advertisement -