- Advertisement -
గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అశ్విన్ కొత్వాల్ ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నీమాబేన్ ఆచార్యకు సమర్పించారు.
ఇప్పటివరకు మూడు సార్లు ఖేద్బ్రహ్మ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు అశ్విన్. నియోజకవర్గ అభివృద్ధి కోసం బీజేపీలో చేరడం తప్పలేదన్నారు.బీజేపీ వల్లే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని… నరేంద్ర మోదీ గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పట్నుంచి ఆయన పనితీరును పరిశీలిస్తున్నానని పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ సారి గుజరాత్లో పాగా వేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోండగా ఈ సారి త్రిముఖపోరు కనిపించే అవకాశం ఉంది.
- Advertisement -