ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం కోల్‌కతా వేదికగా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మధ్య ఈ పోరు జగనుంది. ఇరు జట్లు ఫైనల్‌లో స్థానం కోసం పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా, నేటి మ్యాచ్ కోసం గుజరాత్ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య వెల్లడించాడు. లాకీ ఫెర్గుసన్ స్థానంలో అల్జారీ జోసెఫ్ జట్టులోకి వచ్చాడని వివరించాడు. అటు, రాజస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ సంజు శాంసన్ పేర్కొన్నాడు.
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యష్ దయాళ్
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఓబెడ్ మెకాయ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ