ఐపీఎల్ 2022: టాస్ గెలిచిన గుజరాత్

115
LSG vs GT
- Advertisement -

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈరోజు మరో ఆసక్తికర మ్యాచ్‌ జరుగుతోంది. గుజరాత్, లక్నో జట్లు తలపడుతున్నాయి. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ కోసం మూడు మార్పులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ కేవలం ఒక మార్పుతో బరిలోకి దిగనుంది.

గుజరాత్ టైటన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యష్ దయాళ్, మహమ్మద్ షమీ

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డీకాక్, దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, మొహ్‌సిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, దుష్మంత చమీర

- Advertisement -