ఐపీఎల్ 2022లో ఈరోజు గుజరాత్ టైటన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్.. ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సన్రైజర్స్ జట్టు ఒక్క మార్పు చేసింది.. జగదీష్ సుచిత్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తీసుకుంది.. ఇక గుజరాత్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండు మూడు స్థానాల్లో ఉన్న ఈ జట్లు.. ఈసారి ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజుల క్రితం ఈ రెండు జట్లు పోటీపడగా.. అందులో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. దీంతో ఈసారి ఎస్ఆర్హెచ్పై గుజరాత్ టైటన్స్ రివెంజ్ తీర్చుకుంటుందా ? లేక మరోసారి సన్రైజర్స్ చేతిలో గుజరాత్ టైటన్స్ పరాజయం పాలవుతుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
తుది జట్లు..
గుజరాత్ టైటన్స్: హార్థిక్ పాండ్యా, వృద్ధిమాన్ సహా, శుభమ్ గిల్, అభినమ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ టివాటియా, రషీద్ ఖార్, అల్జరీ జోసెఫ్, లాకీ ఫర్గుసన్, యశ్ దయాల్, మహ్మద్ షమీల.
సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, శశాంత్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక, టి నటరాజన్.