ఐపీఎల్‌లో ఆసక్తికర పోరు.. టాస్ గెలిచిన గుజరాత్..

106
- Advertisement -

ఐపీఎల్‌ 15వ సీజన్‌లో ఈ ఏడాది నుంచి లీగ్ లోకి గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ పేరిట మరో రెండు జట్లు ఎంట్రీ అయిన సంగతి తెలిసిందే. గుజరాత్ జట్టుకు హర్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా, లక్నో జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. సోమవారం వాంఖడే స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల తలపడుతున్నాయి.

టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ లో డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండటంతో టాస్ గెలిచిన జట్లు మొదట బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్నాయి. తాజాగా కేఎల్ రాహుల్ కూడా అదే చేశాడు. కొత్త జట్లు, కొత్త సీజన్… తొలి విజయం ఎవరిదోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), డికాక్, మనీశ్ పాండే, లూయిస్, బదోని, హుడా, కృనాల్ పాండ్యా, మొహ్ సిన్, బిష్ణోయ్, చమీర, అవేశ్ ఖాన్

గుజరాత్ టైటాన్స్: గిల్, వేడ్, మిల్లర్, శంకర్, హార్దిక్, మనోహర్, తెవాటియా, రషీద్ ఖాన్, వరుణ్ అరోన్, ఫెర్గూసన్, షమీ

- Advertisement -